నాకు చెప్పకుండా నన్ను తీసేశారు .. అప్పుడు చాలా బాధపడ్డాను: యాంకర్ ఝాన్సీ
- ఒక రోజున స్టూడియోకి వెళ్లాను
- నా ప్లేస్ లో వేరే యాంకర్ కనిపించింది
- అప్పుడు చాలా బాధపడ్డాను
'ఇలా ఎందుకు చేశారు సార్?' అని అడిగితే .. 'చేంజ్ వుంటే బాగుంటుంది కదా .. 'అనే సమాధానం వచ్చింది. అప్పుడు నిజంగా నాకు చాలా బాధకలిగింది .. అలాంటి బాధ నా వలన వేరొకరికి కలగకూడదనే ఉద్దేశంతో ఒక నిర్ణయానికి వచ్చాను. నా కంటే ముందుగా ఒక యాంకర్ చేసిన ప్రోగ్రామ్ .. నా చేతికి వచ్చినప్పుడు, ముందున్న యాంకర్ కి ఫోన్ చేసి .. ఈ విషయం మీకు తెలుసా? అని అడిగి చేసేదానిని. జగపతిబాబు .. ధర్మవరపు సుబ్రమణ్యం .. మనో .. అవసరాల శ్రీనివాస్ చేసిన ప్రోగ్రామ్స్ నా చేతికి వచ్చినప్పుడు .. వాళ్లను అడిగే ఆ కార్యక్రమాలను చేశాను" అని చెప్పుకొచ్చింది.