ఆ దర్శకుడు, హీరో నన్ను అవమానపరిచారు .. అది ఊరకనే పోలేదు!: యాంకర్ ఝాన్సీ
- ఓ పెద్ద హీరో సినిమా అది
- నాతో ఓ క్యారెక్టర్ రెండు రోజులు చేయించారు
- నాకు చెప్పకుండా వేరొకరిని తీసుకున్నారు
నన్ను ఇబ్బంది పెట్టినవారికి నా శాపం గట్టిగానే తగిలింది. రెండు రోజులు క్యారెక్టర్ చేయించుకుని పీకేసిన వాళ్లకి నా శాపమెలా వుంటుందనేది తెలుసు. ఒక పెద్ద డైరెక్టర్ .. పెద్ద హీరో .. నాతో రెండు రోజులు క్యారెక్టర్ చేయించుకున్నారు .. నా డబ్బులు నాకు ఇచ్చేశారు. నాకు చెప్పాపెట్టకుండా వేరే వ్యక్తితో ఆ పాత్రను చేయించి నన్ను అవమాన పరిచారు. వాళ్లకి నా శాపం బాగా తగిలింది .. ఇంతవరకూ వాళ్లు కోలుకోలేదు" అంటూ చెప్పుకొచ్చింది.