శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలంటూ నటుడు వారాహి ఫిర్యాదు!
- కోలీవుడ్‌కు మకాం మార్చి విరుచుకుపడుతున్న శ్రీరెడ్డి
- వ్యభిచారం కేసులో అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదు
- శ్రీరెడ్డి తీరుపై కోలీవుడ్ ఆగ్రహం
ఇటీవల శ్రీరెడ్డి సంచలన ఆరోపణలతో మరోమారు వివాదానికి తెరలేపింది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, సుందర్.సి, నటుడు రాఘవ లారెన్స్, శ్రీకాంత్ (తెలుగులో శ్రీరామ్) తదితరులపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ హెచ్చరించినా శ్రీరెడ్డి తీరుమారలేదు. చెన్నైలో మకాం పెట్టి మరీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఆమె ఆరోపణలపై కోలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నటి త్రిష మాట్లాడుతూ శ్రీరెడ్డి ఎవరో తనకు తెలియదని, ఆమె ఆరోపణలకు బదులివ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.