మామ నాకు మంచి బహుమతిని ఇచ్చారు: సమంత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మామ నాకు మంచి బహుమతిని ఇచ్చారు: సమంత

  • జర్నలిస్ట్ రచన పాత్రలో కనిపిస్తాను 
  • నిజంగా ముక్కు కుట్టించుకోలేదు 
  • తెలుగు .. తమిళ భాషల్లో డబ్బింగ్ చెప్పాను  
గ్లామర్ పరంగా యూత్ హృదయాలను దోచేసిన సమంత .. ఇటీవల నటనకి ఎక్కువ అవకాశం వుండే పాత్రలనే చేస్తూ వెళుతున్నారు. అలా తాజాగా ఆమె 'యూ టర్న్' సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న నేపథ్యంలో, సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంలోనే .. 'నాగార్జున మీకు ఇచ్చిన బహుమతి ఏమిటి?' అనే ప్రశ్న ఒక అభిమాని అడిగాడు. 'నాగ చైతన్యకి భార్యగా తనని అంగీకరించడమే తనకి మామ ఇచ్చిన పెద్ద గిఫ్ట్' అని ఆమె సమాధానమిచ్చారు.

ఇక మిగతా అభిమానులు అడిగిన ప్రశ్నలకి స్పందిస్తూ .. 'యూ టర్న్' సినిమాలో జర్నలిస్ట్ 'రచన' పాత్రలో నేను కనిపిస్తాను. ఈ సినిమాలో నాకు ముక్కుపుడక ఉంటుంది .. అయితే అది మీరనుకున్నట్టుగా నిజంగా కుట్టించుకోలేదు. దర్శకుడు పవన్ కుమార్ కి గల ప్రతిభ కారణంగానే ఈ సినిమాను ఒప్పుకున్నాను. తెలుగు .. తమిళ భాషల్లో నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాను. ఇక ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా ఆది పినిశెట్టి .. రిపోర్టర్ గా రాహుల్ రవీంద్రన్ కనిపిస్తారు. తప్పకుండా ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది" అని ఆమె చెప్పుకొచ్చారు.      
samanta
aadi pinishetty
rahul

More Telugu News