ఏపీ ప్రజల డిమాండ్ కు కాంగ్రెస్ పూర్తి స్థాయి మద్దతు: మల్లికార్జున ఖర్గే
- ఏపీ ప్రజలకు పూర్తి స్థాయి న్యాయం చేస్తాం
- మీడియా అంతా మోదీకి అనుకూలంగా ఉంది
- మీడియాకు మోదీ భజనే సరిపోతోంది
హైదరాబాద్ ను కోల్పోవడం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయాలని చట్టంలో పేర్కొన్నామని, రాజ్యసభ వేదికగా ఏపీకి అప్పటి ప్రధాని ఆరు విషయాల్లో హామీలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడు రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న జైట్లీ ఆరు విషయాలపై సంతృప్తి వ్యక్తం చేసి.. సవరణలు వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలకు పూర్తి స్థాయి న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని అన్నారు. ప్రస్తుతం మీడియా అంతా మోదీకి అనుకూలంగా ఉందని, ఆయన ప్రకటనలకు ప్రాధాన్యత ఇస్తోందని, ‘మీడియాకు మోదీ మోదీ’ అన్న భజనే సరిపోతోందని ఆరోపించారు.