srinivas: 'సాక్ష్యం'లో ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్

షార్ట్స్‌లో చూడండి
శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ .. పూజా హెగ్డే జంటగా 'సాక్ష్యం' చిత్రం రూపొందింది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకోనుంది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని .. ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాలను వాయిస్ ఓవర్ తో కలపనున్నారు. వాయిస్ ఓవర్ తోనే ఒక సన్నివేశంలో నుంచి మరొక సన్నివేశంలోకి తీసుకెళ్లనున్నారు. ఈ రకంగా వాయిస్ ఓవర్ ప్రత్యేకతను సంతరించుకోవడంతో .. ప్రత్యేకమైన వాయిస్ ను కలిగిన సీనియర్ ఆర్టిస్ట్ తో ఆ వాయిస్ ఓవర్ చెప్పిస్తే బాగుంటుందని భావించారట. ప్రకాశ్ రాజ్ తో చెప్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సంప్రదించడంతో ఆయన ఓకే చెప్పారట. ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.   
Go Back to Shorts
srinivas
pooja hegde

More Telugu News