‘కాంగ్రెస్’ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తోంది: నిర్మలా సీతారామన్
Add ap7am to your home Screen

‘కాంగ్రెస్’ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తోంది: నిర్మలా సీతారామన్

  • ‘రాఫెల్’ అంశంపై ‘కాంగ్రెస్’ ఆరోపణలు తగదు
  • పూర్తి వివరాలు చెప్పలేమని ఫ్రాన్స్ అధ్యక్షుడే చెప్పారు
  • నాటి రక్షణ మంత్రి సంతకం చేసిన పత్రాలను చూపించిన నిర్మలా సీతారామన్  
‘కాంగ్రెస్’ అర్థంపర్థం లేని ఆరోపణలు చేయడం సమంజసం కాదని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. లోక్ సభలో ‘అవిశ్వాసం’పై జరుగుతున్న చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాఫెల్ విమానాల కొనుగోలుపై గోప్యత పాటించాలని 2008లోనే ఒప్పందం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సంతకం చేసిన పత్రాలను సభలో ప్రవేశపెట్టారు. వాణిజ్యపరమైన ఒప్పందం వల్లే పూర్తి వివరాలు వెల్లడించలేమని ఫ్రాన్స్ అధ్యక్షుడే చెప్పారని అన్నారు. కాగా, రహస్య ఒప్పందపత్రాలను సభలో ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయగా, అప్పటి రక్షణ మంత్రి సంతకం చేసిన ప్రతులను మాత్రమే సభ ముందుంచామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
Congress
nirmala sitaraman

More Telugu News