అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్న సోనియాగాంధీ.. వేడెక్కిన ఢిల్లీ రాజకీయాలు!

  • కాంగ్రెస్ ఎంపీలతో అత్యవసరం సమావేశం
  • అవిశ్వాసంపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
  • విపక్షాల మద్దతును కూడగట్టడంపై చర్చ
కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన అవిశ్వాసంపై రేపు లోక్ సభలో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు.

కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ఈ చర్చను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలనే యోచనలో కాంగ్రెస్ ఉంది. చర్చ సందర్భంగా సభలో అనుసరించాల్సిన వ్యూహాలను, కేంద్రాన్ని ఎండగట్టే అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీనికితోడు, వివిధ పార్టీల మద్దతును కూడగట్టడం, విపక్షాలను ఒక్క తాటిపైకి తీసుకురావడం వంటి అంశాలపై కూడా చర్చించబోతున్నారు. దీంతో, ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 
Go Back to Shorts
Sonia Gandhi
no confidence motion

More Telugu News