బాప్‌రే! దేశంలో ఇన్ని రేప్‌లా.. స్వయంగా కేంద్రమే చెప్పింది!
- దేశంలో అడ్డూఅదుపు లేకుండా పోతున్న అత్యాచారాలు
- మూడేళ్లలో లక్షకుపైగా కేసులు
- కఠిన చర్యల కోసం బిల్లు సిద్ధం చేస్తున్నట్టు చెప్పిన మంత్రి
ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి మాట్లాడుతూ, నిందితులను కఠినంగా శిక్షించనున్నట్టు తెలిపారు. రేప్ కేసుల్లో దోషులుగా తేలిన వారికి కఠిన శిక్షలు విధించేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందన్నారు. 12 ఏళ్లు, ఆ లోపు వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించాలన్న ప్రతిపాదన ఉన్నట్టు తెలిపారు. ప్రతిపాదిత బిల్లు త్వరలోనే లోక్‌సభ ముందుకు రానున్నట్టు వివరించారు.