తమిళనాడులో రష్యా యువతిపై గ్యాంగ్ రేప్.. టెంపుల్ టౌన్‌లో ఘటన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళనాడులో రష్యా యువతిపై గ్యాంగ్ రేప్.. టెంపుల్ టౌన్‌లో ఘటన!

  • తిరువణ్ణామలైలో విదేశీ యువతిపై గ్యాంగ్ రేప్
  • పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు
  • యువతి శరీరంపై గాయాలు
తమిళనాడులోని టెంపుల్ టౌన్ అయిన తిరువణ్ణామలైలో రష్యాకు చెందిన 21 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ కేసులో సంబంధం ఉన్న ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిందితుల్లో ఒకతను సోమవారం స్పృహ తప్పిన యువతిని ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఆమెను పరీక్షించిన వైద్యుడు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

బాధిత యువతి శరీరంపై కొరికిన గుర్తులు, ముఖం, చేతులపై గీసుకుపోయిన గుర్తులు ఉన్నట్టు వైద్య నివేదిక పేర్కొంది. ఇది ముమ్మాటికీ లైంగిక దాడేనని, ఘటనా స్థలం నుంచి డ్రగ్స్ సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

బాధిత యువతితో కలిసి ఆలయానికి, ఆశ్రమానికి వెళ్లానని అనుమానితుల్లో ఒకతను పోలీసులకు తెలిపాడు. శనివారం రాత్రి ఆమె తనను అపార్ట్‌మెంట్‌కు ఆహ్వానించిందని పేర్కొన్నాడు. పరస్పర అంగీకారంతోనే ఆమెతో శృంగారంలో పాల్గొన్నట్టు చెప్పాడు. ఆ తర్వాతి రోజు తాను ఆమె అపార్ట్‌మెంటుకు వెళ్లగా సృహ కోల్పోయిన స్థితిలో కనిపించిందని పోలీసులకు వివరించాడు. రేప్ ఘటనపై కేసు నమోదు చేసుకున్న తిరువణ్ణామలై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tamilnadu
Temple Town
Russia
Gang Rape

More Telugu News