ఆలయాలు ఉద్యోగాలు ఇవ్వవు.. తిండి పెట్టవు: శామ్ పిట్రోడా
- ఆలయాలు ఎప్పుడూ ఉద్యోగాలు కల్పించలేవు
- సైన్స్ మాత్రమే భవిష్యత్తును నిర్మించగలదు
- రాజకీయ నాయకుల వల్ల యువత తప్పుదారి
‘‘ఆలయాలు, మతం, దేవుడు, కులం వంటి వాటిపై జరుగుతున్న చర్చలు వింటున్నప్పుడు చాలా బాధనిపిస్తుంటుంది. దేశాన్ని తలచుకుంటే ఆవేదన వస్తుంది. రేపటి రోజున ఆలయాలు ఉద్యోగాలను సృష్టించలేవు. ఒక్క సైన్స్ మాత్రమే ఆ పని చేయగలదు’’ అని పిట్రోడా పేర్కొన్నారు. ఎవరైనా ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారూ అంటే.. దానికి తప్పకుండా రాజకీయ కోణం తోడై ఉంటుందని పేర్కొన్నారు. యువతను ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారన్న ఆయన ముఖ్యంగా రాజకీయ నాయకులే అందుకు కారణమని ఆరోపించారు. పనికిరాని మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారని, ఫలితంగా యువత తప్పుడు దారిలో పయనిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.