అత్యాచారం కేసుల్లో నిందితుల అన్ని లైసెన్సులు రద్దు.. హరియాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం
- అత్యాచార నిందితులకు ఇక కఠిన శిక్షలు
- నిందితులు వృద్ధులు అయితే పింఛన్ కట్
- బాధితులకు లాయర్ ఫీజు కోసం రూ.22 వేలు
రాష్ట్రంలోని మహిళలందరి రక్షణ కోసం ప్రత్యేక పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పిన సీఎం, పంద్రాగస్టున, లేదంటే రక్షాబంధన్ రోజున దానిని ప్రారంభించనున్నట్టు చెప్పారు. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ శిక్ష కోసం ప్రతిపాదన చేసినట్టు చెప్పారు. అలాగే, అత్యాచార బాధితులు తమకు నచ్చిన లాయర్‌ను నియమించుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. న్యాయవాది ఫీజు కింద రూ.22 వేలను చెల్లిస్తుందని సీఎం ఖట్టర్ తెలిపారు.