రజనీకాంత్ సినీ కెరీర్ లో 23 ఏళ్ల తరువాత ఇలా!

  • నవంబర్ 29న విడుదలకు సిద్ధమైన '2.0'
  • ఒకే సంవత్సరంలో రెండు చిత్రాలు
  • 1995లో బాషా, ముత్తు తరువాత ఈ సంవత్సరమే
  • వేసవిలో వచ్చిన 'కాలా', దీపావళి సీజన్ కు '2.0'
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన '2.0' చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్ర దర్శకుడు శంకర్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ ప్రకటించగా, ఆయన అభిమానులు అప్పుడే సంబరాలకు దిగారు. పెద్ద హీరోల సినిమాలు ఏడాదికి ఒకటి రిలీజ్ కావడమే కష్టమైపోతున్న నేటి తరుణంలో రజనీ సినిమాలు ఏడాదిలో రెండు రిలీజ్ కావడాన్ని అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు.

రజనీ కెరీర్ లో రెండు సినిమాలు ఒకే సంవత్సరంలో విడుదల కావడం గత 23 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఏడాది వేసవిలో పా రంజిత్ దర్శకత్వం వహించిన 'కాలా' విడుదలైన సంగతి తెలిసిందే. 1995లో ఆయన నటించిన ముత్తు, బాషా చిత్రాలు విడుదల అయ్యాయి. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించాయి. రజనీ కెరీర్ లో మైలురాళ్లుగా నిలిచాయి. ఆ తరువాత ఆయన ఏడాదికి, రెండేళ్లకు ఒక చిత్రానికి మాత్రమే పరిమితం అయ్యారు. వాస్తవానికి '2.0' గత సంవత్సరమే విడుదల అవుతుందని ప్రచారం జరిగినప్పటికీ, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాక వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Rajanikant
Kaala
Muttu
Basha
2.0
shankar

More Telugu News