బిగ్‌బాస్‌లో ప్రవేశం కోసం నూతన్ నాయుడు అన్ని కోట్లు ఖర్చు చేశాడా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్‌బాస్‌లో ప్రవేశం కోసం నూతన్ నాయుడు అన్ని కోట్లు ఖర్చు చేశాడా?

  • షోలో చోటు కోసం రూ. 4 కోట్లు ఖర్చు చేసినట్టు వార్తలు
  • ఎట్టకేలకు స్పందించిన నాయుడు
  • బిస్కెట్లు కూడా వారు తీసుకెళ్లలేదన్న నూతన్
సోషల్ మీడియాలో బిగ్‌బాస్-2 షోలో పాల్గొని ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు గురించి ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. సామాన్యుడి స్థానంలో ఆయన హౌస్‌లోకి ఎలా ప్రవేశించ గలిగారనేదే చర్చంతా. నిజానికి షోకు వెళ్లకముందు ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న తర్వాత చాలామంది సెలబ్రిటీలుగా మారిపోయారు. కొందరైతే ఏకంగా సినిమా చాన్స్‌లు కూడా కొట్టేశారు. కాబట్టే ఇప్పుడు చర్చంతా నూతన్ నాయుడుపైకి మళ్లింది. ఆయన తన పబ్లిసిటీని పెంచుకునేందుకు ఏకంగా రూ. 4 కోట్లు ఖర్చు చేసి మరీ షోకు వెళ్లాడనేది ఈ చర్చ మొత్తం సారాంశం.

సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం రచ్చరచ్చ అవుతుండడంతో నూతన్ నాయుడు ఎట్టకేలకు స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రమూ నిజం లేదన్నాడు. తానొక్క పైసా కూడా ఇవ్వలేదన్నాడు. తాను డబ్బులిచ్చి షోకు వెళ్లానన్న విషయాన్ని గతంలోనూ పలు ఇంటర్వ్యూల్లో అడిగారని తెలిపారు. బిగ్‌బాస్‌ను నిర్వహిస్తున్న సంస్థకు నాలుగు కోట్ల మొత్తం చాలా చిన్నదని ఆయన పేర్కొన్నారు. సంస్థ ప్రతినిధులు తమ ఇంటికి వచ్చినప్పుడు బొకే ఇచ్చి ఆహ్వానించామని, బిస్కెట్ బాక్స్ ఒకటి ఇచ్చామని నాయుడు తెలిపాడు. అయితే, వారు అవి తీసుకునేందుకు కూడా నిరాకరించారని, వారికి నిజంగా హ్యాట్సాఫ్ అని నాయుడు చెప్పుకొచ్చారు. ఆయన ఇంత క్లారిటీ ఇచ్చాకైనా ఆ చర్చకు తెరపడుతుందో లేదో చూడాల్సిందే.
Big Boss
Star Maa
Nutan Naidu
Andhra Pradesh

More Telugu News