polavaram: ‘పోలవరం’ నిర్మాణానికి కేంద్రం చిత్తశుద్ధితో ఉంది: ఎంపీ హరిబాబు

షార్ట్స్‌లో చూడండి
‘పోలవరం’ నిర్మాణానికి కేంద్రం చిత్తశుద్ధితో ఉందని బీజేపీ ఎంపీ హరిబాబు మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టు ను నితిన్ గడ్కరీ సందర్శించనున్నారని,చెప్పారు. ఏపీలో లక్ష కోట్ల విలువైన రోడ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, విశాఖలోని మానసిక వైద్యశాలలో రూ.30 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీని నిర్మిస్తారని చెప్పారు. పౌరవిమానాలకు ఇబ్బంది రానీయొద్దని తూర్పు నౌకాదళ అధికారిని కోరామని, విశాఖ ఎయిర్ పోర్ట్ పై నేవీ ఆంక్షలపై ఈ నెల 7న కేంద్రానికి వివరించామని, ఆ ఆంక్షలను సడలించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని అన్నారు.  
Go Back to Shorts
polavaram
hari babu

More Telugu News