పరిపూర్ణానంద పోరాటం ఇతరులను రెచ్చగొట్టడానికో... ప్రతీకార చర్యకో కాదు: గణేశానంద భారతి

  • ఈ యాత్రను అడ్డుకోవడం సరికాదు
  • ధర్మాగ్రహ యాత్రను ఇంతగా రాద్ధాంతం చేయొద్దు
  • గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తీసుకురావడం మంచిది కాదు
శ్రీ పీఠాధిపతి, రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి పరిపూర్ణానందను గృహ నిర్బంధం చేయడం సరికాదని స్వామి గణేశానంద భారతి అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పరిపూర్ణానంద తలపెట్టిన 'ధర్మాగ్రహ యాత్ర' ఎవరినో రెచ్చగొట్టడానికో లేక ప్రతీకారచర్యకో కాదని అన్నారు.

ఈ యాత్రను అడ్డుకోవడం సరికాదని, దాన్ని ఇంతగా రాద్ధాంతం చేసి, గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తీసుకురావడం మంచిది కాదని అన్నారు. పరిపూర్ణానందను వెళ్లనిస్తే ఇప్పటికే ఘట్‌కేసర్‌ దాటి ఆయన యాత్ర కొనసాగేదని అన్నారు. పరిపూర్ణానంద యాత్ర సజావుగా ముందుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.  
Go Back to Shorts
paripoornananda
hindu

More Telugu News