కత్తి మహేష్ ను హైదరాబాద్ నుంచి బహిష్కరించిన పోలీసులు
- శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్
- తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్న వ్యాఖ్యలు
- అరెస్ట్ చేసి, ఏపీ పోలీసులకు అప్పగించిన టీఎస్ పోలీసులు
శ్రీరాముడిని విమర్శించిన కత్తి మహేష్ పై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు పెట్టారు. మరోవైపు, కత్తి వ్యాఖ్యలను నిరసిస్తూ... పరిపూర్ణానందస్వామి హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు సిద్ధమయ్యారు. అయితే, యాత్రకు అనుమతిని నిరాకరించిన పోలీసులు... ఆయనను గృహనిర్బంధం చేశారు.