Chidambaram: మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ఇంట్లో భారీ దోపిడీ... కోట్ల విలువైన సొత్తు చోరీ!

షార్ట్స్‌లో చూడండి
మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఇంట్లో భారీ దోపిడీ కలకలం రేపుతోంది. చెన్నయ్, నుంగంబాక్కంలోని పైక్రాఫ్ట్ గార్డెన్ రోడ్ లో ఉన్న ఆయన ఇంట్లో పడ్డ దొంగలు, కోట్ల విలువైన సొత్తును చోరీ చేశారు. చిదంబరం భార్య నళినీ చిదంబరం, నెల రోజుల క్రితం ఊటీకి వెళ్లి, ఈ ఉదయం 7.30 గంటలకు తిరిగి వచ్చి, తలుపులు తాళం తీయగా, ఈ దోపిడీ జరిగిన విషయాన్ని గుర్తించారు. అల్మరాలు ఓపెన్ చేసి ఉండటం, అందులోని ఆభరణాలు, రూ. 1.50 లక్షల నగదు, ఆరు విలువైన చీరలు దొంగిలించబడ్డాయని ఆమె ఫిర్యాదు చేశారు.

ఈ ఘటన వెనుక తమ ఇంట్లో పనిచేసే ఇద్దరు పనిమనుషుల హస్తం ఉండవచ్చన్న అనుమానాన్ని నళినీ చిదంబరం వ్యక్తం చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే, మాస్క్ లు ధరించిన ఇద్దరు ఆడవాళ్లు ఇంట్లోకి వెళుతుండటం కనిపించింది. గతంలో వారు చిదంబరం ఇంట్లో పనిచేశారని, ప్రస్తుతం పరారీలో ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. స్నిఫ్ఫర్ డాగ్స్ ను తేనున్నామని, ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తున్నామని అన్నారు.
Go Back to Shorts
Chidambaram
Theft
Chennai
House
Police

More Telugu News