అసెంబ్లీకి రారు, పార్లమెంట్ కు వెళ్లరు... వీరు మనకెందుకు: వైసీపీ నేతలపై దేవినేని ఉమ విమర్శలు
- రాష్ట్ర ప్రయోజనాలు వీరికి అవసరం లేదు
- కాంగ్రెస్ నేతలే బీజేపీ, వైసీపీ, జనసేన నేతలవుతున్నారు
- అందరూ తోడు దొంగలేనన్న దేవినేని
కాంగ్రెస్ నేతలే బీజేపీ, వైసీపీ నేతలుగా, ఆపై జనసేన నేతలుగా రూపాంతరం చెందుతున్నారని, ఈ మూడు పార్టీలూ తోడు దొంగలేనని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించిన దేవినేని, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, ధర్మాన ప్రసాదరావులు పదేళ్ల పాటు మంత్రులుగా ఉండి రాష్ట్ర ప్రజలకు ఏమీ చెయ్యలేదని నిప్పులు చెరిగారు.