Congress: కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పదవికి, సభ్యత్వానికి స్వామినాయుడు రాజీనామా.. జనసేనలోకి చిరంజీవి యువత

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి నాయుడు జనసేన పార్టీలో చేరబోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 9న చిరంజీవి యువతతో పాటు ఆయన జనసేనలో చేరనున్నారు. మరోపక్క ఈరోజు కూడా పలువురు చిరంజీవి ఫ్యాన్స్ పవన్ కల్యాణ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వారికి జనసేన కండువాలు కప్పిన పవన్‌ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.              
Go Back to Shorts
Congress
Jana Sena
Pawan Kalyan

More Telugu News