ఇన్ స్టాగ్రామ్ లో రికార్డు బద్దలు కొడుతున్న ప్రియాంక చోప్రా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇన్ స్టాగ్రామ్ లో రికార్డు బద్దలు కొడుతున్న ప్రియాంక చోప్రా

  • 2.5 కోట్లకు చేరిన ఫాలోవర్లు
  • ఆమె ప్రియుడు నిక్ జోనాస్ కు 1.55 కోట్ల మంది
  • ప్రధాని మోదీకి 1.35 కోట్ల మందే ఫాలోవర్లు
బాలీవుడ్ నటీమణి ప్రియాంక చోప్రాకు అభిమానులు తెగ పెరిగిపోతున్నారు. అమెరికా సింగర్ నిక్ జోనాస్ కు ప్రియురాలిగా మారిన తర్వాత విదేశాల్లోనూ ఆమె ప్రాబల్యం పెరుగుతోంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఫాలోవర్ల సంఖ్య ఏకంగా రెండున్నర కోట్లకు చేరుకుంది. ‘మీ ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ ప్రియాంక తన స్పందనను తెలియజేసింది.

ఫాలోవర్ల విషయంలో మన దేశ ప్రధాని మోదీ అందుకోలేనంత దూరంలో ప్రియాంక ఉండడం గమనార్హం. మోదీ ఫాలోవర్లు 1.35 కోట్ల మందే. ప్రియాంక తర్వాత అత్యధిక ఫాలోవర్లు దీపిక పదుకునెకు 2.49 కోట్ల మంది ఉన్నారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కు 1.73 కోట్ల మంది, షారూక్ ఖాన్ కు 1.33 కోట్ల మంది, అమితాబచ్చన్ కు 95 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక ప్రియాంక మెచ్చిన ప్రియుడు, ప్రియాంక (35) కంటే వయసులో పదేళ్లు చిన్న వాడైన నిక్ జోనాస్ (25)కు ఫాలోవర్లు 1.55 కోట్ల మంది ఉన్నారు. 
priyanka chopra
Instagram
followers

More Telugu News