తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎంలు ఇకపై రాత్రి వేళ బంద్?
- ఉదయం 5లోపు 5 కన్నా తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎంల మూత
- బ్యాంకర్ల సమావేశంలో పోలీసుల సూచన
- త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న బ్యాంకర్లు
సైబర్ నేరాలను నియంత్రించడానికి రాత్రివేళల్లో ఏటీఎంలను పూర్తిగా మూసివేయాలని పోలీసు అధికారులు సూచించారు. రాత్రిపూట 5 కన్నా తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎంలలో 95 శాతం మారుమూల ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ ఏటీఎంలపై క్లోనింగ్ ముఠాలు కన్నేశాయని, వీటిల్లో స్కిమ్మర్లు, కెమెరాలు ఏర్పాటు చేసి కార్డుల వివరాలు తస్కరిస్తున్నాయని గుర్తు చేసిన అధికారులు వీటిని మూసేస్తేనే మంచిదని స్పష్టం చేశారు. తద్వారా నేరాలకు ఆస్కారం లేకుండా చూడవచ్చన్న పోలీసుల ఆలోచనను ప్రధాన కార్యాలయాల దృష్టికి తీసుకెళ్లి, అనుమతి రాగానే అమలు చేస్తామని బ్యాంకర్లు ప్రకటించారు.