జీవీఎల్‌కు లోకేశ్ సవాల్.. దమ్ముంటే ఆ పేర్లు బయటపెట్టాలని డిమాండ్!
- కేంద్రమంత్రి, బ్రోకర్ పేర్లు బయటపెట్టాలని డిమాండ్
- జీవీఎల్ నైజమే వేరని విమర్శ
- ట్విట్టర్ ఖాతాలో నిప్పులు
జీవీఎల్ నైజమే వేరని, అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో ఆయన సిద్ధహస్తుడని మండిపడ్డారు. ఢిల్లీలో లాబీయింగ్ అంటూ జీవీఎల్ మరో కట్టుకథ మొదలుపెట్టారని అన్నారు. అసత్యాలను ప్రచారం చేయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో ధ్వజమెత్తారు.