కృష్ణా జిల్లాలో ఘోరం... ప్రేమలో పడిందన్న అనుమానంతో కుమార్తెను కొట్టి చంపిన తండ్రి!
- పెంచి పెద్ద చేసిన కుమార్తెపై దారుణం
- పుట్టిన రోజు జరుపుకున్న మరుసటి రోజే పరలోకాలకు
- ఫోన్ లో మాట్లాడుతుంటే అనుమానంతో దాడి
ఆమె తన ప్రియుడితో మాట్లాడుతోందని ఆగ్రహించిన కోటయ్య, ఓ కర్ర తీసుకుని గట్టిగా కొట్టడంతో, తీవ్ర రక్తస్రావమై, ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తన కళ్ల ముందే కుమార్తె మరణించడంతో పద్మావతి స్పృహ కోల్పోయింది. చంద్రిక చనిపోయిందని తెలుసుకున్న తండ్రి ఇంట్లో నుంచి పారిపోగా, పద్మావతి తండ్రి పారా రామారావు జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోటయ్య ఆవేశంలో కోట్టడంతోనే చంద్రిక మృతి చెందిందని రామారావు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.