కుమార్తె ప్రియుడిపై స్పందించిన ప్రియాంకా చోప్రా తల్లి!
- నిక్ జొనాస్ తో పీకల్లోతు ప్రేమలో ప్రియాంకా చోప్రా
- నిక్ తో ఇంతవరకూ మాట్లాడలేదు
- అప్పుడే ఓ అభిప్రాయానికి రావడం కష్టమన్న మధు చోప్రా
ముంబై అప్ స్కేల్ రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ప్రియాంకా తల్లి మధు చోప్రా నిక్ జొనాస్ ను కలిసిందట. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఆమె, ఓ విందు కార్యక్రమానికి తాను, ప్రియాంక వెళితే, అక్కడ నిక్ ఉన్నాడని చెప్పింది. ఓ వ్యక్తిపై తక్కువ సమయంలోనే ఓ అభిప్రాయానికి రావడం కష్టమని, తాను ఇంతవరకూ నిక్ తో మాట్లాడలేదని, ఆ సమయమే తనకింకా దొరకలేదని చెప్పింది.