మీకు తమిళ దేవుడు కావాలి కానీ.. మాకు మాత్రం చుక్క నీరు ఇవ్వరా?: కర్ణాటక సీఎంపై స్టాలిన్ ఫైర్
- కర్ణాటక సీఎంపై స్టాలిన్ ఆగ్రహం
- ఇదెక్కడి స్నేహమని నిలదీత
- తమిళనాడులో ఉన్నది బానిస ప్రభుత్వమన్న డీఎంకే నేత
చుక్కనీరు లేక తమిళ ప్రజలు అల్లాడిపోతుంటే మీక పట్టదా? అని నిలదీశారు. ఇదేం స్నేహమని అన్నారు. ఇరుగుపొరుగు అంటే ఇలా ఉంటారా? అని ప్రశ్నించారు. తమిళనాడులో ప్రస్తుతం ఉన్నది బానిస ప్రభుత్వమని విమర్శించిన స్టాలిన్.. వచ్చే ఎన్నికల్లో దానిని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.