kcr: బీ రెడీ.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. 'బీ రెడీ' అంటూ పార్టీ శ్రేణులను ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, పెండింగ్ పనులన్నింటినీ త్వరతగతిన పూర్తి చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారమైతే వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగాలి. కానీ, లోక్ సభ ఎన్నికలు ముందస్తుగానే జరిగే పరిస్థితి తలెత్తితే, వాటితో పాటే అసెంబ్లీ ఎన్నికలకు కూడా వెళ్లాలని టీఆర్ఎస్ ఇంతకు ముందే ఓ నిర్ణయానికి వచ్చింది.

జమిలీ ఎన్నికల కోసం ప్రధాని మోదీ ఆలోచిస్తున్న తరుణంలో... ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఎన్నికలు జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో మోదీ నుంచి కేసీఆర్ కొంత స్పష్టత తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు ఎన్నికలకు కూడా సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులను ఆయన అప్రమత్తం చేశారు. 
Go Back to Shorts
kcr
elections
alert

More Telugu News