కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వేజోన్ వస్తాయి: విష్ణుకుమార్ రాజు
- విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేరుస్తుంది
- మోదీని చంద్రబాబు నవ్వుతూ పలకరించడం తప్పేమీ కాదే
- ప్రధాన ప్రతిపక్షానికి ఏం పనీ లేకనే ఇలాంటి విమర్శలు చేస్తోంది
ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు నవ్వుతూ పలకరించడం తప్పేం కాదని అన్నారు. విపక్ష ఎమ్మెల్యేలుగా తాము కూడా చంద్రబాబును కలుస్తున్నామని చెప్పిన విష్ణుకుమార్ రాజు, ప్రధాన ప్రతిపక్షానికి ఏం పనీ లేకనే ఇలాంటి విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ల్యాండ్, ఇసుక మాఫియా గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో ఈ రెండు మాఫియాలను పట్టించింది తామేనని, ఇప్పటికీ రాష్ట్రంలో ఇసుక మాఫియా కొనసాగుతోందని ఆరోపించారు.