kavali: బాలకృష్ణ అభిమానులపై గురి పెట్టిన వైసీపీ!

షార్ట్స్‌లో చూడండి
నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ను వైసీపీ ప్రారంభించినట్టు తెలుస్తోంది. పట్టణంలో టీడీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న వార్డుల్లో బలాన్ని పెంచుకునేందుకు వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దృష్టి సారించారు. టీడీపీ ప్రధాన నాయకుడైన మలిశెట్టి వెంకటేశ్వర్లు అనుచరులైన కొంత మందిని ఇప్పటికే వైసీపీలో చేర్చుకుని... వారి ఫొటోలతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు.

మరోవైవు, బాలయ్య అభిమాన సంఘాల మధ్య జరిగిన గొడవను కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాలకృష్ణ అభిమాన సంఘాల మధ్య గొడవ జరగ్గా... ఓ అభిమాన సంఘం నాయకుడైన వల్లెపు కిషోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఆసుపత్రికి వెళ్లి అతన్ని పరామర్శించారు ఎమ్మెల్యే. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో అసంతృప్తి పరులను వైసీపీలో చేర్చుకునేందుకు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం వైసీపీ ముందుకు సాగుతోందని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 
Go Back to Shorts
kavali
Balakrishna
ysrcp
operation akarsh

More Telugu News