మైక్రోమ్యాక్స్ కేన్వాస్-2 ప్లస్ 2018 ఎడిషన్ విడుదల... ధర రూ.8,999

  • 5.7 అంగుళాల ఇన్ఫినిటీ డిస్ ప్లే ఫోన్
  • 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ
  • 13 మెగా పిక్సల్ కెమెరా
దేశీయ మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ కంపెనీ మైక్రోమ్యాక్స్ కేన్వాస్ 2 ప్లస్ 2018 ఎడిషన్ మోడల్ ను తీసుకొచ్చింది. ఈ మోడల్ ఇన్ఫినిటీ డిస్ ప్లే తో ఫుల్ వ్యూగా ఉంటుంది. దీని ధర రూ.8,999. జెట్ బ్లాక్, మ్యాటే బ్లాక్ కలర్ లో లభిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. 5.7 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే మాత్రం కాదు. 1.3 గిగాహెర్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీతో వస్తోంది. వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. 4జీ వోల్టే ఫోన్. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. మారుతున్న కస్టమర్ల ప్రాధాన్యతలకు తగ్గట్టుగా ఈ ఫోన్ ను తీసుకొచ్చినట్టు కంపెనీ సహ వ్యవస్థాపకుడు వికాస్ జైన్ తెలిపారు.
Go Back to Shorts
micromax
canvas plus 2018

More Telugu News