'లవర్' టైటిల్ లోగో రిలీజ్ .. ఈ మూవీపైనే రాజ్ తరుణ్ ఆశలు
- రాజ్ తరుణ్ హీరోగా 'లవర్'
- కథానాయికగా రిద్ధి కుమార్
- రేపు ఉదయం ఫస్టులుక్ రిలీజ్
ఒక అబ్బాయి చేయి .. అమ్మాయి చేయిని పట్టుకున్న పోస్టర్ ఇది. హాస్పిటల్ నేపథ్యంలో హీరో హీరోయిన్లకి సంబంధించిన ఈ స్టిల్ ఆసక్తిని రేకెత్తించేదిలానే వుంది. ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు. వరుస పరాజయాలతో డీలాపడిన రాజ్ తరుణ్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.