Tamilnadu: సినిమా పైరసీ కాపీలను సృష్టిస్తున్న తమిళనాడు థియేటర్... ఎట్టకేలకు సీజ్!

షార్ట్స్‌లో చూడండి
ఏదైనా సినిమా విడుదలైన రోజే హెచ్డీ క్వాలిటీతో పైరసీని విడుదల చేసేందుకు సహకరిస్తుందని చానాళ్లుగా ఆరోపణలున్న తమిళనాడు, కడలూరులోని గోమతి థియేటర్ ఎట్టకేలకు మూతపడింది. ఇటీవలి కాలంలో పైరసీ సీడీల విక్రయాలు పెరిగిపోగా, 'ఒరు కుప్పై కథై' చిత్ర నిర్మాతల ఫిర్యాదుతో పోలీసులు కదిలారు. తాము విదేశీ హక్కులను విక్రయించలేదని, కానీ సినిమా పైరసీ బయటకు రావడంతో నష్టపోయామని నిర్మాతలు ఫిర్యాదు చేశారు.

ఇక గోమతి థియేటర్ లో ఈ పైరసీ సీడీలను ఆధునిక టెక్నాలజీ సాయంతో తయారు చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. అక్కడే పైరసీ సీడీలు తయారు చేస్తున్నట్టు తేలడంతో థియేటరును సీజ్ చేశారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని, కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Tamilnadu
Gomathi
Theatre
Pairacy

More Telugu News