vajpayee: వాజ్ పేయిని పరామర్శించిన సీఎం యోగి

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్ పేయిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా ఈరోజు సాయంత్రం వాజ్ పేయి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

వాజ్ పేయి వేగంగా కోలుకుంటున్నారని వెల్లడించారు. ఇన్ ఫెక్షన్ తగ్గుముఖం పడుతోందని, రెండు, మూడు రోజుల్లో ఆయన్ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా, వాజ్ పేయి త్వరగా కోలుకోవాలంటూ కాన్పూర్, లక్నోలతో పాటు వారణాసిలోని గంగా నది ఒడ్డున బీజేపీ కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. 
Go Back to Shorts
vajpayee
cm yogi

More Telugu News