షాహిద్ అఫ్రిది ఇంట్లో సింహం పిల్ల?.. నెటిజన్ల ఆగ్రహం!
- తన కూతురి ఫొటో పోస్ట్ చేసిన అఫ్రిది
- ఆమె వెనకాల సింహం పిల్ల
- ఇంట్లో సింహాన్ని బంధించాడంటోన్న నెటిజన్లు
అయితే, ఆ ఫొటోల్లో అఫ్రిది ఓ జింకకు పాలు తాగిస్తున్నట్లు ఉండగా, మరో ఫొటోలో ఆయన కూతురి వెనుక ఓ సింహం పిల్ల ఉంది. ఇంట్లో సింహాన్ని పెంచుకోవడమేంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, అది నిజమైన సింహమేనా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు సింహాన్ని ఇంట్లో బంధించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా క్రూర జంతువులను బంధించడం చట్ట విరుద్ధమని అంటున్నారు. మొత్తానికి ఈ ఫొటో వైరల్ అవుతోంది.