Actress: చిరంజీవితో ఆడిపాడిన హీరోయిన్ ఇప్పుడు కర్ణాటక మంత్రి!

షార్ట్స్‌లో చూడండి
ఒకప్పుడు చిరంజీవితో ఆడిపాడిన నటి ఇప్పుడు కర్ణాటకలో కుమారస్వామి కేబినెట్‌లో కీలక పదవిలో ఉన్నారు. చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా రాక్షసుడులో కన్నడి నటి జయమాల తారకేశ్వరిగా నటించింది. ‘నీ మీద నాకు అదయ్యో.. ’ అనే పాటలో మెగాస్టార్‌తో కలిసి స్టెప్పులేసింది. ఇప్పుడా జయమాల కర్ణాటకలో మంత్రి పదవిలో ఉన్నారు.

కుమారస్వామి ఇటీవల చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఆమెకు చోటు దక్కింది. అంతేకాదు, మొత్తం కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రి కూడా ఆమే కావడం గమనార్హం. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, కన్నడ సాంస్కృతిక శాఖ బాధ్యతలను ఆమె నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్న ఆమెను నేరుగా కేబినెట్‌లోకి తీసుకుని కీలక మంత్రి పదవి అప్పగించారు.

1980లలో తెలుగు, తమిళ, కన్నడ, తుళు భాషల్లో జయమాల స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్నారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి చురుకైన పాత్ర పోషించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి పదవి పొందారు. ఈ ఘనత సాధించిన తొలి నటి కూడా ఆమెనే. తనకు మంత్రి పదవి దక్కినందుకు సంతోషం వ్యక్తి చేసిన జయమాల, తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని పేర్కొన్నారు.
Go Back to Shorts
Actress
Jayamala
Karnataka
Minister

More Telugu News