వేసవి విడిది కోసమే ఆయన వచ్చారు!: పవన్ అరకు పర్యటనపై గిడ్డి ఈశ్వరి సెటైర్లు
- వేసవి విడిది కోసమే అరకు వచ్చారు
- రాజకీయ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారు
- రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా?
పాడేరుకు వచ్చిన సందర్భంలో ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేకుండా పవన్ మాట్లాడారని... ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. 2014 తర్వాత రూ. 11 కోట్లతో అరకులో రోడ్లు వేశారని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నా... పవన్ కు కనిపించకపోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.