రామ్ తప్పుకున్నట్టే .. ధనుష్ తో ప్లాన్ చేస్తున్న ప్రవీణ్ సత్తారు?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామ్ తప్పుకున్నట్టే .. ధనుష్ తో ప్లాన్ చేస్తున్న ప్రవీణ్ సత్తారు?

  • నెక్స్ట్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన ప్రవీణ్ సత్తారు 
  • బడ్జెట్ కారణంగా తప్పుకున్న రామ్ 
  • ధనుష్ తో చేయాలని దర్శకుడి ప్రయత్నం  
'గరుడ వేగా' సినిమాతో హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు .. ఆ తరువాత సినిమాకి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ కి ఒక కథ వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయి. అయితే భారీ బడ్జెట్ అవుతుండటంతో ముందుగా ఓకే అన్న నిర్మాత పక్కకి తప్పుకున్నాడు. దాంతో స్రవంతీ మూవీస్ బ్యానర్ పైనే ఈ సినిమా చేయాలనుకున్నారు. కానీ అదే బడ్జెట్ పెరుగుదల కారణంగా వాళ్లు కూడా పక్కకి తప్పుకున్నారు.

ఈ కారణంగా రామ్ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేయడంతో ధనుష్ తో చేయాలని ప్రవీణ్ సత్తారు భావించాడు. తెలుగు .. తమిళ భాషల్లో చేయడం వలన బడ్జెట్ కలిసొస్తుందంటూ ధనుష్ కి వినిపించాడట. ఒక వైపున 'కాలా' సినిమా పనులతోను .. మరో వైపున తాను హీరోగా చేస్తోన్న 'మారి' సీక్వెల్ తోను ధనుష్ బిజీగా వున్నాడు. త్వరలోనే ఆయన తన నిర్ణయాన్ని తెలియజేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.    
dhanush
praveen sattaru

More Telugu News