Congress: టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందన్న వార్తలు అవాస్తవం: రఘువీరారెడ్డి

షార్ట్స్‌లో చూడండి
టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందన్న వార్తలు అవాస్తవమని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఊమెన్ చాందీతో ఈరోజు ఆయన భేటీ అయ్యారు. అనంతరం, మీడియాతో రఘువీరా మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా సాధన నిమిత్తం వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేయడంపై చర్చ అనవసరమని అన్నారు. బీజేపీకి టీడీపీ, వైసీపీ తలొగ్గి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ చేస్తున్న దీక్షలు ఒట్టి బూటకమని కొట్టిపారేశారు. ప్రత్యేక హోదా సాధించే అర్హత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, 2019లో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం చేసేది ప్రత్యేకహోదా ఫైల్ పైనేనని జోస్యం చెప్పారు.
Go Back to Shorts
Congress
raghuveera reddy

More Telugu News