రీ కన్ఫర్మేషన్ లేఖలు ఇవ్వండి: వైసీపీ ఎంపీలతో స్పీకర్
- భావోద్వేగాలతోనే రాజీనామా చేసి ఉంటారు
- వైకాపా ఎంపీలతో సుమిత్రా మహాజన్
- అటువంటిదేమీ లేదని చెప్పిన ఎంపీలు
"భావోద్వేగాలతోనే మీరు రాజీనామాలు చేసి ఉంటారని భావిస్తున్నా" అన్న సుమిత్ర వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీలు, తామేమీ తొందరపడి రాజీనామాల నిర్ణయం తీసుకోలేదని, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చామని స్పష్టం చేశారు. దీంతో లిఖితపూర్వకంగా అదే విషయాన్ని తనకు తెలియజేయాలని ఆమె చెప్పడంతో, మరికాసేపట్లో రీకన్ఫర్మేషన్ లేఖలను ఇవ్వనున్నామని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ మీడియాకు తెలిపారు. కాగా, వైసీపీ ఎంపీల రాజీనామాలను సుమిత్రా మహాజన్ ఆమోదిస్తారని సమాచారం అందుతోంది.