Steve Smith: నిజం చెబుతున్నా.. నాలుగు రోజులు ఏడుపు ఆపలేదు: స్మిత్

షార్ట్స్‌లో చూడండి
బాల్ ట్యాంపరింగ్ తర్వాత నాలుగు రోజులపాటు ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నానని ఆసీస్ మాజీ కెప్టెన్ స్మిత్ తెలిపాడు. సిడ్నీలోని ఓ పాఠశాలను సందర్శించిన స్మిత్ మాట్లాడుతూ బాల్ ట్యాంపరింగ్‌లో చిక్కుకుని స్వదేశం చేరుకున్నాక నాలుగు రోజులపాటు ఏడుస్తూనే ఉన్నానని, ఇది నిజమని పేర్కొన్నాడు. ఆ సమయంలో మానసికంగా కుంగిపోయానని, కళ్లన్నీ బరువుతో నిండిపోయాయన్నాడు.

అయితే, కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా ఉండి చూసుకోవడం తన అదృష్టమని పేర్కొన్నాడు. తనను ఒంటరిగా విడిచిపెట్టకుండా ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ తన బాధను దూరం చేసేందుకు ప్రయత్నించారని వివరించాడు. వారు ఆ రోజు అలా చూసుకున్నారు కాబట్టే తాను ఈ రోజు ఇలా ఉండగలుగుతున్నానని అన్నాడు.

కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో కేమరాన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ వ్యవహారంలో స్మిత్‌, వార్నర్‌ల పాత్ర కూడా ఉందని తేలడంతో వారిద్దరిపై ఏడాది, బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం వేటు పడింది. ఫలితంగా స్మిత్, వార్నర్ ఐపీఎల్‌కు దూరమయ్యారు.
Go Back to Shorts
Steve Smith
Australia
Cricket

More Telugu News