మోదీ వ్యతిరేక ఫ్రంట్‌లో 12 మంది ప్రధాని అభ్యర్థులు: కేంద్రమంత్రి సెటైర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీ వ్యతిరేక ఫ్రంట్‌లో 12 మంది ప్రధాని అభ్యర్థులు: కేంద్రమంత్రి సెటైర్

  • మైనారిటీల్లో భయాలు రేకెత్తిస్తున్నారు
  • వచ్చే ఎన్నికల్లోనూ మాదే విజయం
  • కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ
2019లో ప్రధాని పోస్టు ఖాళీగా లేదని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని కూటమి విజయం సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మోదీ వ్యతిరేక ఫ్రంట్’లో 12 మంది ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేసిన ఆయన వారు స్థిరమైన ప్రభుత్వాన్ని అందించలేరని అన్నారు. మోదీ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మైనారిటీల్లో భయోత్పాతం సృష్టించాలని చూస్తున్నారని  అన్నారు.

దేశంలోని మైనారిటీలు సురక్షితంగా ఉన్నారని, వారి హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లడం లేదని స్పష్టం చేశారు. దేశాభివృద్ధి కోసం మోదీ అహరహం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ సారథ్యంలో ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడుగుతామన్నారు. ప్రజలు తమకు అండగా ఉంటారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
vacancy
prime minister
Mukhtar Abbas Naqvi

More Telugu News