రవితేజ .. శ్రీను వైట్ల మూవీ ప్రత్యేకత అదేనట!
- శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ
- అమెరికాలో జరుగుతోన్న షూటింగ్
- అడ్వాన్స్ టెక్నాలజీ ప్రత్యేక ఆకర్షణ
కొత్తగా ఉపయోగిస్తోన్న సాంకేతిక పరిజ్ఞానం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది అంటున్నారు. ఈ సినిమాను 'రెడ్ మోంస్ట్రో' కెమెరా .. 'జిస్' లెన్స్ తో చిత్రీకరిస్తున్నారట. టాలీవుడ్ కి సంబంధించినంతవరకూ 8 కే రెజల్యూషన్ తో చిత్రీకరించబడుతోన్న తొలి సినిమాగా అరుదైన ఘనత లభించింది. ఈ టెక్నాలజీ వలన తెరపై విజువల్స్ అద్భుతంగా అనిపిస్తూ కనువిందు చేస్తాయని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రవితేజ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న సంగతి తెలిసిందే.