Pawan Kalyan: గిరిజనుల సమస్యలను టీడీపీ సర్కారు పట్టించుకోవడం లేదు: పవన్‌ కల్యాణ్‌

షార్ట్స్‌లో చూడండి
ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం.. ఏపీని విస్మరించిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఓట్ల కోసం మాత్రమే రాజకీయ పార్టీలు పాకులాడుతున్నాయని విమర్శించారు. ఈ రోజు విజయనగరం జిల్లా కురుపాంలో ఆయన పర్యటించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ... గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు తాను వచ్చానని, వారి ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. గిరిజనులు, సామాన్యుల సమస్యలను టీడీపీ సర్కారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గిరిజనుల పట్ల ఇతర పార్టీలకు అభిమానం లేదని, కురుపాంలో కనీస సౌకర్యాలు కూడా లేవని పవన్‌ విమర్శించారు. 
Go Back to Shorts
Pawan Kalyan
NDA
Jana Sena

More Telugu News