charan: రికార్డు స్థాయిలో దూసుకుపోతోన్న రంగమ్మ .. మంగమ్మ పాట!

షార్ట్స్‌లో చూడండి
సుకుమార్ దర్శకత్వంలో చరణ్ .. సమంత జంటగా తెరకెక్కిన 'రంగస్థలం' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కథా కథనాలు .. పాత్రలను మలిచిన తీరు .. సంగీత సాహిత్యాలు ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి. ఈ సినిమాలో చరణ్ .. సమంతలపై చిత్రీకరించిన 'రంగమ్మ .. మంగమ్మ' పాట విశేషమైన ఆదరణ పొందింది. ముఖ్యంగా యూత్ హృదయాలను పొలోమంటూ కొల్లగొట్టేసింది.

ఈ పాటను యూట్యూబ్ లో ఉంచిన నెల రోజులకే రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. నెల రోజుల్లోనే ఈ పాటకు 40 మిలియన్లకి పైగా వ్యూస్ రావడం విశేషం. 'బాహుబలి 2'లోని 'సాహోరే' పాటకు .. 'ఫిదా' లోని 'వచ్చిండే .. ' సాంగ్ కి ఇంతవరకూ 120 మిలియన్లకి పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ సాంగ్స్ ను యూట్యూబ్ లో ఉంచి చాలాకాలమే అయింది. తక్కువ సమయంలోనే ఆ స్థాయి వ్యూస్ ను 'రంగమ్మ ..  మంగమ్మ' రాబట్టవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.    
Go Back to Shorts
charan
samanta

More Telugu News