'అద్దె మైకు, సొంత మైకు'... కన్నాను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తుంటే నవ్వులు!
- ఏపీ బీజేపీ అధ్యక్షుడైన తరువాత విమర్శల జోరు పెంచిన కన్నా
- మహానాడు ఆఖరి రోజున ప్రస్తావించిన చంద్రబాబు
- బీజేపీకి అద్దె మైకు, జగన్ కు సొంత మైకులా మారారని విమర్శ
"నిన్నే ఒకాయన మాట్లాడుతున్నారు. ఆయన్నేమనాలో నాకు అర్థం కావట్లేదు. బీజేపీ పార్టీకి ప్రెసిడెంటు కొత్తగా... అంతకుమునుపు మీరు చూస్తే, వైసీపీలోకి పోవాలని ప్లెక్సీలు, కార్లు అన్నీ రెడీ చేసుకుని, లాస్ట్ మూమెంట్ లో హాస్పిటల్ లో అడ్మిట్ అయి, ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ అయి, బీజేపీకి అద్దె మైకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంత మైకు కింద తయారయ్యారు. ఆలాంటి వ్యక్తులు మనల్ని గురించి విమర్శిస్తారు. ఈ వ్యక్తులే నాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక్క మాట కూడా మాట్లాడలేదు" అని ఎద్దేవా చేశారు. కాగా, ఏపీకి బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, కన్నా నిత్యమూ చంద్రబాబు సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.