కర్ణాటకలో బీజేపీ బంద్ అట్టర్ ఫ్లాప్.. తలలు పట్టుకున్న బీజేపీ నేతలు!
- రైతు రుణాలను మాఫీ చేయాలని బీజేపీ డిమాండ్
- సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపు
- పట్టించుకోని రైతులు, ప్రజలు
స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలంటూ రైతులు, ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా బంద్ ప్రభావం కనిపించలేదు. స్కూళ్లు, కాలేజీలు, రవాణా వ్యవస్థలకు ఎక్కడా ఆటంకం కలగలేదు. బంద్ పిలుపులో రాజకీయ కోణం ఉందన్న కారణంతో చాలామంది రైతులు, కన్నడ సంస్థలు బంద్‌కు దూరంగా ఉన్నాయి. తామిచ్చిన బంద్ పిలుపు అట్టర్ ఫ్లాప్ కావడంతో ప్రతిపక్ష బీజేపీ నిరాశలో కూరుకుపోయింది.