Vijayawada: అందుకోసమే, శ్రీవేంకటేశ్వరుడు నాడు నన్ను కాపాడాడు!: సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
నాడు అలిపిరి ఘటనలో తాను ప్రాణాలతో బయటపడ్డ సంఘటన గురించి సీఎం చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. విజయవాడ వేదికగా ఈరోజు నుంచి మహానాడు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, నాడు 24 క్లైమోర్లు పేల్చినా శ్రీవేంకటేశ్వరస్వామి తనను కాపాడారని, నవ్యాంధ్రను ముందుండి తాను నడిపించాలనే ఉద్దేశంతోనే స్వామి వారు తన కాపాడారంటూ తన భక్తిని చాటుకున్నారు.

ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన బీజేపీపై విరుచుకుపడ్డారు. కేంద్రం చేసిన నమ్మకద్రోహాన్ని నిరసిస్తూ ధర్మపోరాట దీక్షలు చేస్తున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాకు అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? మాపై ఎందుకు వివిక్ష చూపుతున్నారు? అని ప్రశ్నించారు. మన హక్కుల గురించి అడుగుతుంటే..కొందరిని మనపై రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. దేశ రాజకీయాలను మార్చే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Vijayawada
mahanadu
Chandrababu

More Telugu News