కోమటిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్.. ధన్యవాదాలు చెబుతూనే, సెటైర్లు వేసిన కోమటిరెడ్డి
- కోమటిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- తనను ఎమ్మెల్యేగా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపిన కోమటిరెడ్డి
- ఇతర ప్రొటోకాల్ విషయాలను ఎందుకు పట్టించుకోవడంలేదు అంటూ ప్రశ్న
ఎమ్మెల్యేగా తనను గుర్తించిన ముఖ్యమంత్రి... ఇతర ప్రొటోకాల్ అంశాలను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. తనకు భద్రత, ఇతర సౌకర్యాలను కల్పించడాన్ని సీఎం పట్టించుకోవడం లేదని అన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ పై దాడి చేశారంటూ కోమటిరెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారు హైకోర్టును ఆశ్రయించారు. వీరిద్దరికీ అనుకూలంగా తీర్పును వెలువరించిన కోర్టు... ఇద్దరి శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఆదేశించింది.
.