Pawan Kalyan: అలా నాపై పూలు చల్లకండి: పవన్ కల్యాణ్‌ విజ్ఞప్తి

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో నిరసన కవాతు నిర్వహించారు. పలాసలో హరిశంకర్ థియేటర్ నుంచి కాశిబుగ్గ బస్టాండ్ వరకు జరిగిన ఆ కవాతులో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కాశిబుగ్గ బస్టాండ్ వద్ద జరుగుతోన్న బహిరంగ సభలో పవన్ కల్యాణ్‌ ప్రసంగిస్తున్నారు.

అయితే, ప్రసంగం ప్రారంభంలో పవన్‌ కల్యాణ్‌పై కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. దీంతో పవన్‌ కల్యాణ్ పూలు చల్లాల్సింది తనపై కాదని, జనసైనికులపై చల్లాలని అన్నారు. కార్యకర్తలందరూ సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. కాగా, ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగానే తాము ఈ రోజు కవాతు నిర్వహించామని అన్నారు.  కాగా, జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఏపీలో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena
Srikakulam District

More Telugu News