పెద్దగా చదువుకోలేకపోవడం .. నా గురించి పేపర్లో అలా రాయడం బాధ కలిగించాయి: సీనియర్ హీరోయిన్ నళిని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెద్దగా చదువుకోలేకపోవడం .. నా గురించి పేపర్లో అలా రాయడం బాధ కలిగించాయి: సీనియర్ హీరోయిన్ నళిని

  • 8th లోనే చదువు ఆగిపోయింది
  • గాసిప్స్ కూడా బాధ కలిగిస్తాయి 
  • బైక్ పై బయటికి వెళితే అలా రాశారు
విభిన్నమైన పాత్రలలో .. విలక్షణమైన నటనను ప్రదర్శిస్తూ అటు సినిమాల్లోను .. ఇటు ధారావాహికల్లోను నళిని మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా'లో మాట్లాడుతూ తనకి బాగా బాధను కలిగించిన విషయాలను పంచుకున్నారు. " నా జీవితంలో నాకు బాగా బాధను కలిగించే విషయం నా చదువు. పెద్దగా చదువుకోలేకపోయానే అనే బాధ ఇప్పటికీ అలాగే వుండిపోయింది. కనీసం 10వ తరగతి కూడా చదవకుండా 8th లోనే నా చదువు ఆగిపోవడం నా దురదృష్టం".

"ఇక గాసిప్స్ కూడా నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంటాయి. ఒకసారి నాకు బైక్ పై తిరగాలని వుందని మా అన్నయ్యకి చెప్పాను. ఆర్టిస్ట్ అయ్యాక అలా తిరగడం కష్టమవుతుందని అన్నయ్య అన్నాడు. కానీ నా పోరు పడలేక ఒకసారి బీచ్ కి తీసుకెళ్లి తీసుకొచ్చాడు. అంతే.. నేను ఎవరితోనో చక్కర్లు కొడుతున్నట్టుగా మర్నాడు అన్ని పేపర్లలో వచ్చేసింది. దాంతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అసలు విషయం చెప్పాల్సి వచ్చింది. ఆ సంఘటన కూడా నాకు ఎంతో బాధను కలిగించింది" అని చెప్పుకొచ్చారు.    
nalini

More Telugu News